కొన్ని నియోజకవర్గాలలోనే త్రిముఖ పోటీ?

November 20, 2023


img

ఈసారి తెలంగాణ శాసనసభ ఎన్నికలలో ప్రధానంగా బిఆర్ఎస్-కాంగ్రెస్‌ పార్టీల మద్యనే పోటీ జరుగుతున్నట్లు ఇప్పటికే స్పష్టమైంది. బండి సంజయ్‌, రఘునందన్ రావు, ఈటల రాజేందర్‌, రాజా సింగ్, సోయం బాపూరావు వంటి సీనియర్ నేతలు పోటీ చేస్తున్న నియోజకవర్గాలలో బిఆర్ఎస్-కాంగ్రెస్‌, మజ్లీస్‌ పార్టీలకు గట్టి పోటీ ఇస్తున్నారు. కనుక అక్కడ మాత్రమే త్రిముఖ పోటీ నెలకొని ఉండగా మిగిలిన అన్ని నియోజకవర్గాలలో బిఆర్ఎస్-కాంగ్రెస్‌ పార్టీల మద్యనే ద్విముఖ పోటీ నెలకొంది. 

ఉదాహరణకు కోమటిరెడ్డి సోదరులకు నల్గొండలో, పొంగులేటి, తుమ్మలకు ఖమ్మం, కొత్తగూడెం జిల్లాలో మంచి పట్టుంది. అదేవిదంగా బిఆర్ఎస్‌ పార్టీకి సిద్ధిపేట, సంగారెడ్డి, రంగారెడ్డి, కామారెడ్డి, కరీంనగర్‌, వరంగల్,మహబూబ్ నగర్‌, సూర్యాపేట, నాగర్‌కర్నూల్‌, నిజామాబాద్‌, నిర్మల్ సిరిసిల్ల తదితర జిల్లాలపై పూర్తి పట్టు ఉంది. 

బిఆర్ఎస్‌-కాంగ్రెస్‌ పార్టీలు రెంటికీ హైదరాబాద్‌, సికింద్రాబాద్‌, మెదక్, సంగారెడ్డి, రంగారెడ్డి, కామారెడ్డి, కరీంనగర్‌, వరంగల్, ఖమ్మం జిల్లాలపై పట్టుంది. కనుక ఈ రెండు పార్టీలకు పట్టున్న చోట ద్విముఖ పోటీయే సాగుతోంది. 

నల్గొండలో కోమటిరెడ్డి సోదరులు, ఖమ్మంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈసారి బిఆర్ఎస్ పార్టీ ఒక్క సీటు కూడా గెలవనీయమని గొప్పగా చెప్పుకొంటున్నారు. కనుక ఈ రెండు జిల్లాలలో బిఆర్ఎస్‌-కాంగ్రెస్‌ పార్టీల మద్య పోటీ మరింత తీవ్రంగా ఉంది.  

హైదరాబాద్‌, సికింద్రాబాద్‌, వరంగల్, ఖమ్మంలో స్థిరపడిన ఆంధ్రా ఓటర్లు కూడా కాంగ్రెస్‌, బిఆర్ఎస్ పార్టీల మద్య చీలిపోయి ఉన్నారు. ఒకవేళ ఏపీలో చంద్రబాబు నాయుడు అరెస్టు వారిపై ప్రభావంచూపిన్నట్లయితే ఈసారి అందరూ కాంగ్రెస్‌ వైపు మొగ్గు చూపవచ్చు. 


Related Post