తెలుగు సినిమాలలో బాబు మోహన్ చాలా కామెడీ చేసి అందరినీ నవ్వించారు. కానీ రాజకీయాలలో మాత్రం పార్టీని, ప్రజలను ఎవరినీ సంతోషపరచలేకపోతున్నారు. బిఆర్ఎస్ పార్టీలో నుంచి బీజేపీకి మారిన ఆయన ఈసారి సంగారెడ్డి జిల్లాలోని ఆంథోల్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. అయితే ఆయన కుమారుడు ఉదయ్ బాబు మోహన్ ఈరోజు ఉదయం మంత్రి హరీష్ రావు సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరిపోయారు. ఇది కామెడీ కాదు రాజకీయమే అనుకోకతప్పదు. ఉదయ్ బాబు తండ్రితో విభేదించి బిఆర్ఎస్ పార్టీలో చేరారా లేక బాబు మోహనే తన కొడుకుని బిఆర్ఎస్‌లోకి పంపించి ఎన్నికల తర్వాత మళ్ళీ తాను కూడా బిఆర్ఎస్ గూటికే చేరుకోవాలని ప్లాన్ చేశారో?
ఉదయ్ బాబుతో పాటు ఆందోల్, జోగిపేటకు చెందిన పలువురు బీజేపీ నేతలు మంత్రి హరీష్ రావు సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరిపోయారు.