నిజామాబాద్‌లో అభ్యర్ధి ఆత్మహత్య!

November 19, 2023


img

తెలంగాణ శాసనసభ ఎన్నికలలో నిజామాబాద్‌ అర్బన్ నియోజకవర్గం నుంచి అలయన్స్ ఆఫ్ డెమోక్రెటిక్ రిఫార్మ్స్ పార్టీ అభ్యర్ధిగా నామినేషన్ వేసిన కన్నయ గౌడ్ (36) ఈరోజు ఉదయం తన ఇంట్లో ఊరి వేసుకొని ఆత్మహత్య చేసుకొన్నాడు. కొందరు వ్యక్తులు అతని మొబైల్ ఫోన్‌ని హ్యాక్ చేసి మార్ఫింగ్ ఫోటోలను పంపిస్తూ, డబ్బు కోసం బ్లాక్ మెయిల్ చేసి వేధిస్తుండటంతో అవి భరించలేకనే ఆత్మహత్య చేసుకొన్నాడని నిజామాబాద్‌ 4వ పట్టణ ఎస్సై సంజీవ్ తెలిపారు. కేసు నమోదు చేసుకొని కాల్ డాటా ఆధారంగా కన్నయ్య గౌడ్‌ని బ్లాక్ మెయిల్ చేసినవారి కోసం గాలిస్తున్నామని ఎస్సై సంజీవ్ తెలిపారు. 

ఎన్నికలలో పోటీ చేస్తున్న కన్నయ్య గౌడ్ ఆత్మహత్య ఎన్నికలకు ముందు ఆత్మహత్య చేసుకోవడంతో ఎన్నికల సంఘం పోలింగ్ వాయిదా వేస్తుందా లేదా అనేది తెలియాల్సి ఉంది. 

నిజామాబాద్‌ అర్బన్ నియోజకవర్గం నుంచి బిగాల గణేశ్ గుప్తా (బిఆర్ఎస్), షబ్బీర్ అలీ (కాంగ్రెస్‌), ధన్ ప్రభుత్వోద్యోగులు సూర్యనారాయణ (బీజేపీ) పోటీ చేస్తున్నారు. ఈ నెల 30వ తేదీన పోలింగ్ జరుగుతుంది. డిసెంబర్‌ 3న ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటించనున్నారు.


Related Post