ఎన్నికల ప్రచారంలో స్పృహ తప్పిన కల్వకుంట్ల కవిత

November 18, 2023


img

బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈరోజు జగిత్యాల జిల్లా రాయికల్ మండలం ఇటిక్యాలలో ఎన్నికల ప్రచారంలో డీహైడ్రేషన్ కారణంగా కాసేపు స్పృహ కోల్పోయారు. ఆమె స్థానిక బిఆర్ఎస్‌ అభ్యర్ధి సంజయ్ కుమార్‌కు మద్దతుగా ఎన్నికల ప్రచార వాహనంపై ఎక్కి ప్రచారంలో పాల్గొన్నప్పుడు అకస్మాత్తుగా నీరసించి కింద కూర్చుండిపోయారు.

వెంటనే పక్కనే ఉన్న బిఆర్ఎస్‌ కార్యకర్తలు ఆమెకు రోడ్డు పక్కనే చెట్టు నీడలో కూర్చోబెట్టి సపర్యలు చేయడంతో కోలుకొన్నారు. ఇంతలో డాక్టర్ చంద్రశేఖర్ గౌడ్ అక్కడకు చేరుకొని ఆమెకు ప్రాధమిక చికిత్స చేశారు.కాసేపటికి ఆమె కోల్కోని మళ్ళీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.

స్వల్ప అస్వస్థతకు గురవడంతో అందరినీ ఇబ్బంది పెట్టానని, కానీ వెంటనే కోలుకొన్నానని, మళ్ళీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నానని కల్వకుంట్ల కవిత ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా ఆమె ఓ చిన్నారితో మాట్లాడుతూ తీసిన వీడియోని ట్విట్టర్‌లో షేర్ చేశారు.    



Related Post