కాంగ్రెస్‌లో చేరగానే విజయశాంతికి రివార్డ్

November 18, 2023


img

తెలంగాణ రాజకీయాలలో ఫైర్ బ్రాండ్ మహిళా నేతగా పేరున్న విజయశాంతి బీజేపీకి గుడ్ బై చెప్పేసి మళ్ళీ కాంగ్రెస్‌ గూటికి చేరుకొన్నారు. బీజేపీలో తనకు తగిన ప్రాధాన్యం, గుర్తింపు లభించడం లేదనే ఆమె కాంగ్రెస్‌లో చేరారు. కనుక కాంగ్రెస్‌ అధిష్టానం ఆమె పార్టీలో చేరిన వెంటనే కీలక బాధ్యతలు అప్పగించింది.

ఎన్నికల ప్రచారానికి మరో 10 రోజులు మాత్రమే గడువు ఉంది కనుక ఇప్పుడు ప్రచార వ్యూహాలే పార్టీ గెలుపోటములను నిర్దేశిస్తాయి. ఈ దశలో ఆమెకు కాంగ్రెస్‌ ఎన్నికల ప్రచార ప్లానింగ్ కమిటీకి ప్రధాన సమన్వయకర్తగా నియమించి కీలక బాధ్యతలు అప్పగించింది.

ఈ కమిటీ నేరుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనదు కానీ ఏ నియోజకవర్గంలో ఏవిదంగా ఎన్నికల ప్రచారం చేయాలి? అక్కడ పార్టీల బలాబలాలు ఏవిదంగా ఉన్నాయి? వాటిని బట్టి ఏఏ అంశాలను హైలైట్ చేయాలి? మీడియా, సోషల్ మీడియాలో ప్రచారం ఏవిదంగా సాగాలి? వంటి పలు అంశాలను నిర్ణయించి అమలుచేయిస్తుంది. 

ఈ కమిటీలో మల్లు రవి, నరేందర్ రెడ్డి, రాములు నాయక్, కోదంరెడ్డి, రామ్మూర్తి నాయక్, పిట్ల నాగేశ్వర్ రావు, సమరసింహా రెడ్డి, పుష్పలీల, దీపక్ జాన్, అలీ బిన్ ఇబ్రహీం, పారిజాత రెడ్డి, సిద్దేశ్వర్, ఒబేదుల్లా కొత్వాల్ సమన్వయకర్తలుగా ఉన్నారు. 

ఈ ఎన్నికల తర్వాత ఏప్రిల్-మే నెలల్లో జరిగే లోక్‌సభ ఎన్నికలలో విజయశాంతి మెదక్ నుంచి పోటీ చేయబోతున్నట్లు తెలుస్తోంది. 


Related Post