తెలంగాణలో బిఆర్ఎస్‌, కాంగ్రెస్‌ దేనికి అధికారం?

November 18, 2023


img

ఈసారి శాసనసభ ఎన్నికలలో బిఆర్ఎస్‌కు కాంగ్రెస్ పార్టీ గట్టి పోటీ ఇస్తోంది. కనుక ఈసారి కాంగ్రెస్‌ గెలిచి అధికారంలోకి రాగలదా?లేదా? బిఆర్ఎస్‌ మళ్ళీ అధికారంలోకి వస్తే కాంగ్రెస్‌ పరిస్థితి ఏమిటి?అని ఆలోచిస్తే ఈ విధంగా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

1. ఎన్నికలలో బిఆర్ఎస్‌, కాంగ్రెస్ రెండు పార్టీలు తీవ్రంగా పోటీ పడుతున్నాయి కనుక ఇంచుమించుగా రెంటికీ సరిసమానమైన సీట్లు రావచ్చు. అదే కనుక జరిగితే కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలందరూ బిఆర్ఎస్‌లోకి క్యూ కడతారని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ముందే చెప్పేశారు.

2. సర్వేలు సూచిస్తున్నట్లు బిఆర్ఎస్‌ పార్టీ 72-76 సీట్లతో అధికారంలోకి రావచ్చు. అప్పుడు కూడా కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు బిఆర్ఎస్‌లోకి క్యూ కట్టవచ్చు.  

3. రాష్ట్రంలో ‘కాంగ్రెస్‌ గాలి’ బలంగా వీస్తోంది కనుక అది కూడా 72-76 సీట్లతో లేదా ఇంకా భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. అప్పుడు బిఆర్ఎస్‌ ఎమ్మెల్యేలలో కొందరు కాంగ్రెస్‌లో చేరిపోవచ్చు. 

4.  ఒకవేళ రాష్ట్రంలో కాంగ్రెస్‌ వస్తే మజ్లీస్‌ దాంతో చేతులు కలుపుతుందా?లేక బిఆర్ఎస్ పార్టీతోనే ఉంటుందా? అంటే కేంద్రంలో కూడా కాంగ్రెస్‌ కూటమి అధికారంలోకి వస్తేనే రాష్ట్రంలో కాంగ్రెస్‌తో చేతులు కలుపుతుంది లేకుంటే బిఆర్ఎస్ పార్టీతోనే కొనసాగవచ్చు.


Related Post