రాహుల్ పర్యటనకు భారీగా జనం... మార్పు తప్పదా?

November 18, 2023


img

కాంగ్రెస్‌ సీనియర్ నేత రాహుల్ గాంధీ శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పినపాక నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా పాదయాత్ర చేసినప్పుడు చాలా భారీగా జనం తరలివచ్చారు. కాంగ్రెస్‌ నేతలు జనసమీకరణ చేశారనుకొన్నా అన్ని వేలమందిని తరలించడం అసాధ్యం. కనుక రాష్ట్ర ప్రజలు ఈసారి ప్రభుత్వ మార్పు కోరుకొంటున్నారని భావించాల్సి ఉంటుందేమో?

రాహుల్ గాంధీ వారిని ఉద్దేశ్యించి ప్రసంగిస్తూ, “రాష్ట్రంలో 24 విద్యుత్ సరఫరా కేసీఆర్‌ ఇంటికే ఉంది. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే రైతులకు తప్పకుండా 24 గంటలు విద్యుత్ అందిస్తాము. బీజేపీ, బిఆర్ఎస్‌, మజ్లీస్‌ మూడు పార్టీలు ఒక్కటే. వాటి లక్ష్యం కాంగ్రెస్‌ను ఓడించడమే. బీజేపీ, బిఆర్ఎస్‌ ఇస్తున్న డబ్బుతోనే మజ్లీస్ పార్టీ ఇతర రాష్ట్రాలలో పోటీ చేస్తూ కాంగ్రెస్‌ని దెబ్బ తీయాలని చూస్తోంది. కేసీఆర్‌ కుటుంబం ప్రాజెక్టుల నిర్మాణం పేరుతో భారీగా ప్రజాధనం దోచుకొంటోంది. ఆ డబ్బునే ఎన్నికలలో విచ్చలవిడిగా ఖర్చు చేస్తూ కాంగ్రెస్‌ను ఓడించాలని ప్రయత్నిస్తోంది. కానీ ఈసారి ఎన్నికలలో మూడు పార్టీలు కొట్టుకుపోవడం ఖాయం. ఈ ఎన్నికల తర్వాత ఇక్కడ కేసీఆర్‌, లోక్‌సభ ఎన్నికల తర్వాత అక్కడ ఢిల్లీలో నరేంద్ర మోడీ ఇద్దరూ గద్దె దిగడం ఖాయం. కాంగ్రెస్‌ అధికారంలోకి రావడం ఖాయం,” అన్నారు. 



Related Post