తెలంగాణ శాసనసభ ఎన్నికలలో జనసేన 32 స్థానాలలో పోటీ చేయబోతున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బొంగునూరి మహేందర్ రెడ్డి ప్రకటించారు. తెలంగాణ ఉద్య్మ ఆకాంక్షలు నెరవేర్చేందుకు జనసేన కట్టుబడి ఉందని తెలిపారు. రాష్ట్రంలో తమ పార్టీకి బలం 32 నియోజకవర్గాలలో బలం ఉన్నందున ఆ స్థానాల నుంచి పోటీకి సిద్దంగా ఉన్నామని, ఒకవేళ ఇతర పార్టీలేవైనా తమతో కలిసి పోటీ చేయదలచుకొంటే పొత్తులకు సిద్దమని, లేకుంటే ఒంటరిగా పోటీ చేస్తామని తెలిపారు.
తెలంగాణలో జనసేన పోటీ చేయబోయే నియోజకవర్గాలు ఇవే: గ్రేటర్ పరిధిలో ఎల్బీనగర్, ఉప్పల్, కుత్బుల్లాపూర్, మేడ్చల్, మల్కాజిగిరి, సనత్‌నగర్, కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, పటాన్‌చెరు.
ఇతర జిల్లాలలో వరంగల్ వెస్ట్, వరంగల్ ఈస్ట్, ఖమ్మం, మధిర, పాలేరు, కొత్తగూడెం, అశ్వారావుపేట, సత్తుపల్లి, వైరా, మంథని, ఇల్లందు, స్టేషన్‌ఘన్‌పూర్, నాగర్‌కర్నూల్, మునుగోడు, నర్సంపేట, పాలకుర్తి, హుస్నాబాద్, రామగుండం, జగిత్యాల, నకిరేకల్, హుజూర్‌నగర్, కోదాడ, ఖానాపూర్ నియోజకవర్గాలలో పోటీ చేయబోతున్నట్లు తెలిపారు.