బిఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు శుక్రవారం ప్రకటించారు. కేసీఆర్ ప్రకటించిన తొలి జాబితాలో ఆయనకు మళ్ళీ మల్కాజిగిరి నుంచి పోటీ చేయడానికి టికెట్ ఖరారు చేసినప్పటికీ, తన కుమారుడుకి కూడా మెదక్ టికెట్ ఇవ్వనందుకు అలిగారు.
ఆ కోపంలో పార్టీలో సీనియర్ నేత, మంత్రి హరీష్ రావుపై చాలా అనుచిత వ్యాఖ్యలు చేశారు. దాంతో ఆయనను పార్టీలో నుంచి తొలగించాలని సిఎం కేసీఆర్ కూడా అనుకొన్నారు. కానీ ఆయన గెలుపు గుర్రం కావడంతో ఇంతకాలం ఓపిక పట్టారు. అలాగే మైనంపల్లి కూడా మొదట అలిగినప్పటికీ పార్టీ వీడే విషయంలో పునరాలోచనలో పడ్డారు.
కానీ ఎట్టకేలకు బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకొని తన రాజీనామా లేఖను నిన్న కేసీఆర్‌కు పంపిన్నట్లు ప్రకటించారు. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు తెలుస్తోంది. కానీ కాంగ్రెస్ పార్టీలో కూడా మల్కాజిగిరి, మెదక్ టికెట్ల కోసం చాలా మంది పోటీ పడుతున్నారు కనుక మరి ఆయనకు రెండు సీట్లు ఇచ్చి పార్టీలో చేర్చుకోగలదా?లేకుంటే మైనంపల్లి హన్మంతరావు బీజేపీ లేదా మరేదైనా పార్టీలో చేరవలసి ఉంటుంది.