వృద్ధులు ఇక పోలింగ్ కేంద్రాలకు రానక్కరలేదు

September 21, 2023


img

కేంద్ర ఎన్నికల కమీషన్ మంచి నిర్ణయం తీసుకొంది. దేశంలో 80 ఏళ్ళు పైబడిన వృద్ధులందరికీ ఇంటి నుంచే పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసేందుకు అవకాశం కల్పించాలని నిర్ణయించింది. ముందుగా ఈ డిసెంబర్‌లోగా శాసనసభ ఎన్నికలు జరుగబోతున్న తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌ఘడ్‌, రాజస్థాన్, మిజోరాం రాష్ట్రాలలో ఈ వెసులుబాటు కల్పించాలని నిర్ణయించింది.

తెలంగాణలో 80 ఏళ్ళు పైబడిన ఓటర్లు 4,87,950 మంది ఉన్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం సీఈసీకి తెలియజేసింది. వారందరికీ ఈసారి ఇంటు నుంచే ఓట్లు వేసేందుకు బ్యాలెట్ పేపర్లు ముద్రించవలసి ఉంటుంది.

దేశంలో పోస్టల్ బ్యాలెట్ ఎప్పటి నుంచో విజయవంతంగా నిర్వహిస్తున్నారు కనుక ఇప్పుడు వయోవృద్ధులకు కూడా ఈ వెసులుబాటు కల్పించడం ఎన్నికల సంఘాలకు పెద్ద కష్టం కాబోదు. అయితే ఇంటి నుంచే ఓట్లు వేయాలనుకొంటున్న వృద్ధులు ముందుగా ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. 


Related Post