సీడబ్ల్యూసీలో మొబైల్ ఫోన్లు బయటే!

September 16, 2023


img

హైదరాబాద్‌ హోటల్‌ తాజ్ కృష్ణలో కొద్దిసేపటి క్రితమే కాంగ్రెస్‌ వర్కింగ్ కమిటీ తొలిరోజు సమావేశం ప్రారంభం అయ్యింది. దీనిలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లిఖార్జున ఖర్గేతో సహా కాంగ్రెస్‌ అగ్రనేతలందరూ పాల్గొంటున్నారు. అయితే సోనియా గాంధీతో సహా ఎవరినీ మొబైల్ ఫోన్లు సమావేశంలోకి తీసుకువెళ్ళనీయకుండా బయటే తీసుకొని లోనికి పంపించడం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఫోన్ ట్యాపింగ్ చేస్తోందని అనుమానిస్తునందునే, ఫోన్లను లోనికి అనుమతించలేదని తెలుస్తోంది. 

ఈ సమావేశాలలో త్వరలో జరుగబోయే 5 రాష్టాల ఎన్నికలు, 2024లో జరుగబోయే లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అనుసరించాల్సిన వ్యూహాల గురించి, ఇండియా కూటమితో సీట్ల సర్దుబాట్ల గురించి చర్చించనున్నారు. కనుక ఈ సమాచారం బయటకు పొక్కితే కాంగ్రెస్‌ పార్టీ నష్టపోతుంది. కనుక ఈసారి మొహమాటపడకుండా అందరి మొబైల్ ఫోన్లను బయటే స్వాధీనం చేసుకొని లోనికి పంపించారు. 


సమావేశం మొదలవుతునప్పుడు మీడియా ప్రతినిధుల రెండు మూడు ఫోటోలు తీసుకోవడానికి మాత్రం అనుమతించడంతో ఆ ఫోటోలే బయటకు వచ్చాయి. రాత్రి 7-8 గంటల వరకు ఈ సమావేశం జరుగవచ్చని తెలుస్తోంది. 

తుమ్మల నాగేశ్వరరావు ఈరోజు మల్లిఖార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. 


Related Post