బొల్లారం అరబిందో ఫార్మాలో గ్యాస్ లీక్

June 01, 2023


img

హైదరాబాద్‌, బొల్లారం అరబిందో ఫార్మాలో ఈరోజు ఉదయం గ్యాస్ లీక్ అవడంతో ఏడుగురు కార్మికులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అపస్మారకస్థితిలో ఉన్న వారిని వెంటనే సమీపంలోగల ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించి ప్రదమ చికిత్స అందించారు.  వారిలో జె.గౌరి, ఏ విమల, కె.శ్రీనివాసరావులు ఊపిరితీసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతుండటంతో వెంటిలేటర్ పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. మిగిలిన నలుగురి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. 

కంపెనీలోని యూనిట్-2లో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకొన్న బాచుపల్లి పోలీసులు కంపెనీ వద్దకు చేరుకొని కేసు నమోదు చేసుకొని విచారణ ప్రారంభించారు. లేబర్ ఇన్‌స్పెక్టర్, కాలుష్య నివారణ మండలి అధికారులు, అగ్నిమాపక సిబ్బంది కూడా ఘటన స్థలానికి చేరుకొని అధికారులను, కార్మికులను ప్రశ్నించి ప్రమాదానికి గల కారణాలను తెలుసుకొని వేర్వేరుగా నివేదికలు తయారు చేస్తున్నారు. వాటి ఆధారంగా ప్రభుత్వం ఆ కంపెనీపై చర్యలు తీసుకొంటుంది. 


Related Post