హైదరాబాద్‌లో మరో భారీ నిర్మాణం... ఈసారి ట్విన్ టవర్స్!

May 30, 2023


img

తెలంగాణ ఏర్పడిన తర్వాత రాజధాని హైదరాబాద్‌తో సహా రాష్ట్ర వ్యాప్తంగా అనేక భారీ నిర్మాణాలు జరిగాయి. హైదరాబాద్‌లో ప్రగతి భవన్‌, దుర్గం చెరువు కేబిల్ బ్రిడ్జ్, పోలీస్ కమాండ్ కంట్రోల్, 125 అడుగుల డా.అంబేడ్కర్‌ విగ్రహం, సచివాలయం, అమరవీరుల స్తూపం, నలువైపులా నాలుగు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, ఇంకా అనేక ఫ్లైఓవర్లు, స్కైవాక్‌లు నిర్మించింది. ఇంకా అనేకం నిర్మిస్తూనే ఉంది. 

జిల్లాలలో కాళేశ్వరం ప్రాజెక్టుతో సహా ఇంకా అనేక సాగునీటి ప్రాజెక్టులు  సమీకృత కలెక్టరేట్ భవనాలు, సమీకృత మార్కెట్లు, ప్రభుత్వాసుపత్రులు, ఐ‌టి హబ్‌లు, ట్యాంక్ బండ్‌లు, వరంగల్‌ నగరంలో 22 అంతస్తుల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌ వగైరా అనేకం నిర్మించబడ్డాయి. ఇంకా నిర్మిస్తూనే ఉంది.      

అమెరికాలోని వైట్‌హౌస్‌కు తీసిపోని విధంగా తెలంగాణ సచివాలయం నిర్మింపజేసిన కేసీఆర్‌, ఇప్పుడు వివిద శాఖలలో విభగాధిపతులు అందరి కార్యాలయాలు ఒకే చోట ఉండేవిదంగా సచివాలయానికి వీలైనంత సమీపంలో ‘ట్విన్ టవర్స్’ నిర్మించాలని నిర్ణయించారు. దీని కోసం తగిన ప్రదేశాన్ని వెతుకవలసిందిగా సిఎం కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. 

సచివాలయం సమీపంలో అమరవీరుల స్తూపం వద్ద ఖాళీగా ఉన్న ప్రదేశంలో తెలంగాణ తల్లి విగ్రహం, చక్కటి ఫౌంటెయిన్స్ ఏర్పాటు చేయవలసిందిగా అధికారులకు ఆదేశించారు.                             



Related Post