నీతి ఆయోగ్, పార్లమెంట్ ప్రారంభోత్సవానికి కేసీఆర్‌ డుమ్మా!

May 27, 2023


img

నేడు ప్రధాని నరేంద్రమోడీ అధ్యక్షతన ఢిల్లీలో నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ 8వ సమావేశం జరుగనుంది. రేపు ఉదయం కొత్త పార్లమెంట్  భవనం ప్రారంభోత్సవం కానుంది. ఈ రెండు కార్యక్రమాలకు సిఎం కేసీఆర్‌ హాజరుకాబోవడం లేదు. కొత్త పార్లమెంట్  భవనాన్ని రాష్ట్రపతికి బదులు ప్రధాని నరేంద్రమోడీ ప్రారంభోత్సవం చేస్తుండటాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్‌, మిత్రపక్షాలు ఈ రెండు కార్యక్రమాలను బహిష్కరించాయి. బిఆర్ఎస్ పార్టీ అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు కానీ అది కూడా ఈ రెండు కార్యక్రమాలకు హాజరుకావడం లేదు. 

కాంగ్రెస్‌, మిత్రపక్షాల పిలుపుమేరకు బిజెపిని వ్యతిరేకిస్తున్న అన్ని పార్టీలు, ముఖ్యమంత్రులు కూడా ఈ ఈ రెండు కార్యక్రమాలకు దూరంగా ఉండిపోయారు. అయితే ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డి, ఒడిశా సిఎం నవీన్ పట్నాయక్ ఇద్దరూ ఈ కార్యక్రమాలకు హాజరవుతున్నారు. 

కనుక పార్లమెంట్ ప్రారంభోత్సవం కార్యక్రమం దేశంలో విపక్షాలన్నీ ఒక్క తాటిపైకి వచ్చేందుకు ఉపయోగపడిందని చెప్పవచ్చు. అయితే విపక్షాల ఐక్యత పైకి కనబడుతున్నంత బలంగా కూడా లేదని చెప్పవచ్చు. కేసీఆర్‌ కాంగ్రెస్‌తో కలిసి పనిచేయడానికి ఇష్టపడటం లేదు. కనుక కాంగ్రెస్‌తో కలిసి పనిచేయాలనుకొంటున్న పార్టీలను కూడా దూరం పెట్టి, దేశంలో రాజకీయ నిరుద్యోగులను, రైతుల సాయంతో జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పాలని ప్రయత్నిస్తున్నారు. 

ఇక నితీశ్ కుమార్‌, మమతా బెనర్జీ ఇద్దరూ ప్రస్తుతం కాంగ్రెస్‌తో కలిసి పనిచేస్తున్నప్పటికీ వారు రాహుల్ గాంధీ నాయకత్వాన్ని అంగీకరించరు. అలాగే వారిద్దరూ కూడా ప్రధానమంత్రి పదవికి పోటీ పడుతున్నారు కనుక వారిలో ఎవరో ఒకరు వెనక్కు తగ్గి మరొకరిని నాయకుడుగా అంగీకరిస్తే తప్ప వారి కూటమి ఎక్కువ కాలం కలిసికట్టుగా నిలబడటం కష్టమే. కనుక ప్రతిపక్షాలు ఈ సమస్యలన్నిటినీ అధిగమిస్తే తప్ప అవి కేంద్రంలో అధికారం చేజిక్కించుకోలేవు. ప్రతిపక్షాల ఈ బలహీనత, అనైఖ్యతే బిజెపికి, మోడీ ప్రభుత్వానికి వరం, బలం కూడా.


Related Post