ఖమ్మంలో ఎన్టీఆర్‌ విగ్రహం ఏర్పాటుకు హైకోర్టు నిరాకరణ

May 26, 2023


img

ఖమ్మం లకారం చెరువు మద్యలో శ్రీకృష్ణుడు రూపంలో ఉన్న ఎన్టీఆర్‌ విగ్రహం ఏర్పాటుకు హైకోర్టు అనుమతి నిరాకరించింది. దీనిపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ దాఖలైన పిటిషన్లపై ఈ నెల 25న హైకోర్టు విచారణ చేపట్టి, ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత స్టే విధించింది.

దాంతో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌ సూచన మేరకు శ్రీకృష్ణుడు చేతిలోని పిల్లనగ్రోవిని, కిరీటంలో నెమలి పించాన్ని తీసివేసి, ఈ నెల 28న విగ్రహావిష్కరణకు ఏర్పాట్లు మొదలుపెట్టారు. దీనిపై మళ్ళీ నిన్న విచారణ చేపట్టిన హైకోర్టు ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత శ్రీకృష్ణుడి రూపంలో ఎన్టీఆర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు అనుమతించడం లేదని స్పష్టం చేసింది. ఈ కేసు తదుపరి విచారణను జూన్ 6వ తేదీకి వాయిదా వేసింది. కనుక మే 28న ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమం రద్దయిన్నట్లే భావించవచ్చు. 

రూ.3-4 కోట్లు వ్యయంతో 54 అడుగుల ఎత్తైన ఈ విగ్రహాన్ని అమెరికాలో ఎన్‌ఆర్ఐల సహాయ సహకారాలతో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌ తయారుచేయించారు. కానీ ఆదిభట్ల కళాపీఠం, శ్రీకృష్ణ జాక్, యాదవ్‌ సంఘాలు, నటి కరాటే కళ్యాణి తదితరులవి కలిపి మొత్తం 14 పిటిషన్లు దాఖలయ్యాయి. ఎన్టీఆర్‌ విగ్రహం ఆయన రూపంలోనే ఏర్పాటు చేసుకొంటే తమకు ఎటువంటి అభ్యంతరం లేదు కానీ తాము పూజించుకొనే శ్రీకృష్ణుడి రూపంలో విగ్రహం ఏర్పాటు చేయడాన్నే తాము వ్యతిరేకిస్తున్నామని వారు పేర్కొన్నారు. వారి వాదనలతో ఏకీభవించిన హైకోర్టు ఎన్టీఆర్‌ విగ్రహావిష్కరణ చేయవద్దని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.



Related Post