బండి భగీరథ్‌కి దుండిగల్ పోలీసులు నోటీస్ జారీ

January 28, 2023


img

తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌ కుమారుడు బండి భగీరథ్‌కు దుండిగల్ పోలీసులు సెక్షన్ 41సి కింద వారం రోజుల క్రితమే నోటీసు జారీ చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్‌లోని మహేంద్ర యూనివర్సిటీలో బీ.టెక్ చదువుతున్న బండి భగీరథ్‌ తోటి విద్యార్ధిని దూషిస్తూ చెంపదెబ్బలు కొట్టాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

దీనిపై యూనివర్సిటీ విద్యార్థుల వ్యవహారాలని చూస్తే సుఖేష్ పోలీసులకి ఫిర్యాదు చేయడంతో దుండిగల్ పోలీసులు కేసు నమోదు చేసారు. ఈ నెల 18న బండి భగీరథ్‌ దుండిగల్ పోలీస్ స్టేషన్‌కి వెళ్లినప్పుడు సీఐ రమాణా రెడ్డి అతనిని ప్రశ్నించి పంపించివేశారు. రెండు రోజుల తర్వాత మళ్ళీ బండి భగీరథ్‌ని పోలీస్ స్టేషన్‌కి పిలిచి ప్రశ్నించిన తర్వాత నోటీస్ అందజేసారు. ఈ కేసు విచారణకి ఎప్పుడు పిలిచినా హాజరు కావాలని దానిలో పేర్కొన్నారు. 

పోలీసులు తన కుమారుడికి నోటీస్ ఇచ్చి పోలీస్ స్టేషన్‌ చుట్టూ తిప్పించుకొంటుండటంపై బండి సంజయ్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యూనివర్సిటీలో విద్యార్థుల మద్య చిన్న గొడవ జరిగితే దానిని సాకుగా చూపి తన కొడుకుని వేదిస్తున్నారని, కేసీఆర్‌ తనని రాజకీయంగా ఎదుర్కోలేకనే ఈవిదంగా కక్ష సాధింపు చర్యలకి పాల్పడుతున్నారని బండి సంజయ్‌ ఆరోపించారు.


Related Post