ఆమెని నేను వేధించలేదు: ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌

January 26, 2023


img

జగిత్యాల మున్సిపల్ ఛైర్ పర్సన్‌ భోగ శ్రావణి మీడియా ఎదుట స్థానిక బిఆర్ఎస్‌ ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌ తనని చాలా వేధిస్తున్నారని, ఇక ఆ వేధింపులు భరించలేకపోతున్నానని కన్నీళ్లు పెట్టుకొని ఏడుస్తూ తన పదవికి రాజీనామా చేశారు.

ఆమె ఆరోపణలపై సంజయ్ కుమార్‌ స్పందిస్తూ, “నేను ఏనాడూ ఆమెని ఏవిదంగానూ వేధించలేదు. నాకు ఆమె కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం ఏమిటి? ఆమె నాపై అటువంటి ఆరోపణలు చేయడం నన్ను చాలా బాధించాయి. కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం పెడతానంటే నేనే ఆమెకి ఫోన్‌ చేసి కౌన్సిలర్లతో సమావేశం ఏర్పాటు చేస్తే వచ్చి మాట్లాడుతానని చెప్పాను. కానీ ఆమె వినకుండా మీడియా ముందుకు వచ్చి నాపై లేనిపోని ఆరోపణలు చేసి తన పదవికి రాజీనామా చేసేశారు. ఇప్పటికైనా ఆమె నాతో కలిసి పనిచేసేందుకు అంగీకరిస్తే నేను కౌన్సిలర్లతో మాట్లాడి వివాదాన్ని పరిష్కరించడానికి ప్రయత్నిస్తాను. ఇక ఆమె రాజకీయ కారణాలతోనే తన పదవికి రాజీనామా చేసి ఉంటారని భావిస్తున్నాను. ఆమె విషయం మా పార్టీ అధిష్టానం చూసుకొంటుంది,” అని అన్నారు.       



Related Post