తెలంగాణ సచివాలయం ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారు

January 24, 2023


img

తెలంగాణ ప్రభుత్వం కొత్త నిర్మిస్తున్న సచివాలయ భవనం ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారు అయ్యింది. ఫిభ్రవరి 17వ తేదీన సిఎం కేసీఆర్‌ పుట్టినరోజునాడు మధ్యాహ్నం 11.30-12.30 గంటల మద్య ప్రారంభోత్సవ కార్యక్రమం జరుగుతుందని రోడ్లు, భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మీడియాకి తెలియజేశారు. ప్రారంభోత్సవానికి ముందు ఉదయం నుంచి సచివాలయంలో వేదపండితుల అధ్వర్యంలో వాస్తుపూజ, తర్వాత చండీ, సుదర్శన యాగాలు జరుగుతాయని చెప్పారు. 

సచివాలయం ప్రారంభోత్సవానికి తమిళనాడు, ఝార్ఖండ్, ముఖ్యమంత్రులు స్టాలిన్, హేమంత్ సొరేన్, బిహార్‌ ముఖ్యమంత్రి తరపున ఉప ముఖ్యమంత్రి తేజస్వినీ యాదవ్, జేడీయూ అధ్యక్షుడు లలన్ సింగ్‌, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ మనుమడు ప్రకాష్ అంబేడ్కర్, ఇంకా పలువురు ప్రముఖులు హాజరవుతారని తెలిపారు. అదే రోజు సాయంత్రం సికింద్రాబాద్‌ పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగే బహిరంగసభలో సిఎం కేసీఆర్‌తో పాటు వారందరూ పాల్గొంటారని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు.   Related Post