కల్వకుంట్ల కవితకి సిబిఐ నోటీస్ జారీ

December 30, 2022


img

ఊహించిందే జరిగింది. తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె, టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో సిబిఐ నోటీస్ జారీ చేసింది. ఈనెల 6వ తేదీన ఉదయం 11 గంటలకు ఢిల్లీలోని సిబిఐ కార్యాలయంలో లేదా హైదరాబాదులోని ఆమె నివాసంలో విచారణ జరపాలనుకుంటున్నామని సిబిఐ నోటీసులో పేర్కొంది. అందుకు ఆమె బదులిస్తూ హైదరాబాదులో తన నివాసంలో విచారణకు సిద్ధమని తెలియచేశారు.


Related Post