బిజెపిని ఎలా ఓడించాలో రాహుల్ కనిపెట్టేశారు.. ఇక ఎన్నికలే ఆలస్యం!

November 28, 2022


img

అవును... బిజెపిని ఎలా ఓడించాలో రాహుల్ గాంధీ కనిపెట్టేశారు. ఇక ఎన్నికలే ఆలస్యం! ఒంటి చేత్తో ఓడించి పడేస్తారు. ఇంతకీ ఎలా అంటారా... ఇది చదివితే తెలుస్తుంది. ప్రస్తుతం మద్యప్రదేశ్ రాష్ట్రంలో భారత్‌ జోడో పాదయాత్ర చేస్తున్న రాహుల్ గాంధీ అక్కడి నేతలతో ఆదివారం సాయంత్రం సమావేశమైనప్పుడు “ఆర్ఎస్ఎస్‌తో మనం పోరాడుతున్నప్పుడు దాని శక్తిని ఏవిదంగా మనం సొంతం చేసుకోవాలనే విషయం మీకు చెపుతాను,” అంటూ ఓ కాంగ్రెస్‌ నేతను పిలిచి మోకాళ్ళపై కూర్చోమని చెప్పారు. రాహుల్ గాంధీ అతనికి ఎదురుగా నిలబడి తోసేసరికి అతను వెల్లకిలా పడిపోయారు.

ఆ తర్వాత అక్కడ కూర్చోన్న ఓ నలుగురు కాంగ్రెస్‌ నేతలందరినీ ఒకరివెనుక ఒకరిని వరుసగా నిలుచోబెట్టి ఆ వ్యక్తిని బలంగా తోయమని సూచించారు. ఈసారి కూడా ఆ వ్యక్తి మోకాళ్ళపైనే కూర్చోన్నాడు అయితే కాస్త పైకి లేచి వంగొని తనను కిందకు తోసేందుకు ప్రయత్నిస్తున్న కాంగ్రెస్‌ నేత చేతిని బలంగా పట్టుకొన్నాడు. పదిమంది కాంగ్రెస్‌ నేతలు తోసినా అతను ఈసారి కింద పడిపోలేదు. మార్షియల్ ఆర్ట్స్ లో ఈ టెక్నిక్‌ని ఉపయోగిస్తుంటారు. ఇదేవిదంగా కాంగ్రెస్‌ నేతలు కూడా ఆర్ఎస్ఎస్ శక్తిని అడ్డుకొని దానిని సొంతం చేసుకోవచ్చునని వివరించారు. అది చూసి నవ్వాలో ఎడ్వాలో తెలియని కాంగ్రెస్‌ నేతలు చప్పట్లు చరిచారు. రాహుల్ బాబా ఖుష్ హోగయా! 


Related Post