నిజామాబాద్‌ జిల్లాలో మరో కొత్త మండలం ఏర్పాటు

November 23, 2022


img

నిజామాబాద్‌ జిల్లా బాన్సువాడ నియోజకవర్గం పరిధిలో పోతంగల్ కేంద్రంగా మరో కొత్త మండలం ఏర్పాటైంది. ఈ మేరకు మంగళవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. పోతంగల్ మండల కేంద్రంలో మొత్తం 13 గ్రామాలు ఉండేలా ఏర్పాటు చేశారు. మండలంలోని ప్రజలు, ప్రజా ప్రతినిధుల అభ్యర్ధనల మేరకు రాష్ట్ర ప్రభుత్వం పోతంగల్ మండలాన్ని ఏర్పాటు చేసింది. బాన్సువాడ టిఆర్ఎస్‌ ఎమ్మెల్యే, శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్‌కి కృతజ్ఞతలు తెలుపుకొన్నారు. దీంతో కలిపి జిల్లాలో మొత్తం 30 మండలాలు అవుతాయి. 

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 74 రెవెన్యూ డివిజన్‌లు, 594 రెవెన్యూ మండలాలు, 10,909 రెవెన్యూ విలేజ్‌లు, 12,769 గ్రామ పంచాయతీలు, 129 మున్సిపాలిటీలు, 13 మునిసిపల్ కార్పొరేషన్లు ఉన్నాయి.    Related Post