కేంద్రం ఉత్తర్వులపై తెలంగాణ హైకోర్టు స్టే

September 29, 2022


img

తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి చెల్లించాల్సిన రూ.3,441.78 కోట్ల విద్యుత్‌ బకాయిలు, సర్ ఛార్జీలు రూ.3,315.14 కోట్లతో కలిపి మొత్తం రూ.6756.92 కోట్లు ముప్పై రోజులలోపుగా చెల్లించాలని కేంద్ర ప్రభుత్వం ఆగస్ట్ 29న ఉత్తర్వులు జారీ చేసింది. దానిపై తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ విద్యుత్‌ సంస్థలు అభ్యంతరాలు తెలుపుతూ రాష్ట్ర హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు వేశాయి. 

జస్టిస్ జె.శ్రీనివాసరావు, జస్టిస్ పి.నవీన్ రావులతో కూడిన హైకోర్టు ధర్మాసనం బుదవారం వాటిపై విచారణ జరిపింది. రాష్ట్ర ప్రభుత్వం, విద్యుత్‌ సంస్థల వాదనలు వినకుండానే కేంద్రం ఏకపక్షంగా ఉత్తర్వులు జారీ చేయడం సరికాదని వాటి తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యావాది దుష్యంత్ దవే, వైవీ రామారావు వాదించారు. హైకోర్టు వారి వాదనలతో ఏకీభవిస్తూ ఈ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వంపై ఎటువంటి కటిన చర్యలు తీసుకోరాదని స్పష్టం చేసింది. ఈ కేసులో కేంద్ర ప్రభుత్వం, ఏపీ ప్రభుత్వం, ఏపీ విద్యుత్‌ సంస్థలను కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ ఈ కేసు తదుపరి విచారణను అక్టోబర్‌ 18వ తేదీకి వాయిదా వేసింది. 


Related Post