వెక్కి వెక్కి ఏడ్చిన సితార... నిర్వేదంగా కృష్ణ!

September 28, 2022


img

అలనాటి మేటి నటుడు కృష్ణ అర్దాంగి, మహేష్ బాబు తల్లి ఇందిరాదేవి ఈరోజు తెల్లవారుజామున కన్నుమూశారు.  మహేష్ బాబు కుమార్తె సితారకు బామ్మ అంటే చాలా ఇష్టం. అటువంటి బామ్మను ఫ్రీజర్ బాక్సులో అచేతనంగా పడుకొని ఉండటం చూసి సితార తండ్రి ఒడిలో కూర్చొని వెక్కి వెక్కి ఏడుస్తూనే ఉంది. మహేష్ బాబు ఆమెను భుజం తట్టి ఓదార్చుతుండగా పక్కనే కన్నీళ్ళు ఇంకిపోయిన కళ్ళతో మౌనంగా భార్య మృతదేహాన్ని చూస్తున్న తండ్రిని చూసి ఎలా ఓదార్చాలో తెలియక ఆయన చేయి పట్టుకొన్నారు. వారు ముగ్గురినీ చూసి అందరూ కంటతడిపెట్టారు. మహేష్ బాబు అన్న రమేష్ బాబు కొంతకాలం క్రితమే చనిపోయిన సంగతి తెలిసిందే. ఆ బాధ నుంచి తేరుకోక మునుపే ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్న ఇందిరాదేవి చనిపోవడంతో ఘట్టమనేని కుటుంబ సభ్యులు అందరూ తీవ్ర విషాదంలో మునిగిపోయారు. 

తెలుగు సినీ పరిశ్రమలోని నిర్మాతలు, దర్శకులు, నటీనటులు అందరూ వచ్చి ఇందిరాదేవికి నివాళులు అర్పించి కృష్ణ, మహేష్ బాబులను ఓదార్చారు. తెలంగాణ ప్రభుత్వం తరపున మంత్రులు కేటీఆర్‌, తలసాని శ్రీనివాస్ యాదవ్, సినీ పరిశ్రమ నుంచి చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, జీవితా రాజశేఖర్, మోహన్ బాబు, మురళీకృష్ణ, బండ్ల గణేశ్, అశేవినీ దత్, కొరటాల శివ, త్రివిక్రమ్ శ్రీనివాస్, తదితరులు వచ్చిఇందిరాదేవికి నివాళులు అర్పించారు. ఈరోజు మధ్యాహ్నం జూబ్లీహిల్స్‌లోలోని మహాప్రస్థానంలో ఇందిరాదేవి అంతిమ సంస్కారాలు నిర్వహిస్తున్నారు.     

(వీడియో ఎన్టీవీ సౌజన్యంతో)

Related Post