జగనన్న బాణం పేరు మార్చుకొందేమిటో?

September 26, 2022


img

నేడు సంగారెడ్డి జిల్లాలో పాదయాత్ర చేస్తున్న వైఎస్ షర్మిల స్థానిక ఎమ్మెల్యే జగ్గారెడ్డిని ‘పార్టీలు మారే అవకాశవాది’ అని విమర్శించడంతో ఆయన వెంటనే మీడియా సమావేశం ఏర్పాటుచేసి, ఆమెను, ఆమె సోదరుడు సిఎం జగన్మోహన్ రెడ్డిని, వారి తల్లితండ్రులు విజయమ్మ, వైఎస్ రాజశేఖర్ రెడ్డిని అందరినీ కలిపి కడిగేశారు. 

“ఇదివరకు ఆమె ‘నేను జగనన్న బాణాన్ని అని చెప్పుకొనేది. ఇప్పుడు వైఎస్ఆర్ బాణానన్ని చెప్పుకొంటున్నారు. కానీ అన్నాచెల్లెలు ఇద్దరూ మోడీ వేసిన బాణాలే. ఇద్దరూ తామ ఆస్తులు కాపాడుకోవడానికి, కేసులలో చిక్కుకోకుండా తప్పించుకోవడానికే ప్రధాని నరేంద్రమోడీకి విధేయంగా ఉంటున్నారు. తెలంగాణలో స్థిరపడిన ఆంద్రా ఓటర్లను చీల్చి బిజెపిని గెలిపించడం కోసమే ఆమె పాదయాత్ర చేస్తున్నారు. పార్టీల ఫిరాయింపులను ఆనాడు వైఎస్సారే ప్రోత్సహించేవారు. 

ఆయన చనిపోయినప్పుడు మావంటి కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలు బాధపడుతుంటే జగన్, షర్మిల ఇద్దరూ రాష్ట్రానికి ఎవరు ముఖ్యమంత్రి కావాలి... ఎలా మద్దతు కూడగట్టుకోవాలని రహస్య మంతనాలు చేశారు. ఇటువంటివారా నన్ను విమర్శించేది? ఇక్కడ ఈమె పాదయాత్రలు చేస్తూ రాజకీయాలు చేస్తుంటే అక్కడ ఏపీలో ఆమె అన్న జగన్ ఎన్టీఆర్‌ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చి వైఎస్సార్ పేరు పెట్టుకొన్నారు. ఇది ఖచ్చితంగా తప్పే. అధికారం చేతిలో ఉందికదా అని చేస్తే రేపు అదిపోయిన తర్వాత బాధపడవలసి వస్తుంది. ఏపీ సిఎం జగన్ రాష్ట్రాభివృద్ధిని పట్టించుకోకుండా మూడు రాజధానులు పేరుతో కాలక్షేపం చేస్తున్నారు,” అంటూ ఘాటుగా విమర్శించారు. 


Related Post