తెలంగాణలో కొత్తగా 12 సెంట్రల్ డ్రగ్ స్టోర్స్

September 22, 2022


img

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వాసుపత్రులు, ప్రాధమిక ఆరోగ్యకేంద్రాలు, బస్తీ దవాఖానాలకు అవసరమైన మందులు సెంట్రల్ డ్రగ్ స్టోర్స్ (సీఎంఎస్‌) నుంచి సరఫరా అవుతుంటాయి. రాష్ట్రంలో ఆసుపత్రుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నందున కొత్తగా మరో 12 సెంట్రల్ డ్రగ్ స్టోర్స్ ఏర్పాటుచేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ ఈ మేరకు బుదవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో యాదాద్రి భువనగిరి, సిద్ధిపేట, వికారాబాద్, మంచిర్యాల, జగిత్యాల, సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, నాగర్ కర్నూల్, గద్వాల, వనపర్తి జిల్లాలలో వీటిని ఏర్పాటు చేయబోతున్నట్లు జీవోలో పేర్కొన్నారు. ఒక్కో కేంద్రంలో ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్, ఒక వచ్చే ఎన్నికలలో మ్యాన్, ముగ్గురు మందులు ప్యాకింగ్ సిబ్బంది చొప్పున అవుట్ సోర్సింగ్‌ విధానంలో నియమిస్తారు. ఒక్కో సీఎంఎస్‌ ఏర్పాటుకి రూ.3.60 కోట్లు చొప్పున మొత్తం రూ.43.20 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేయనుంది.      Related Post