ఇదిగిదిగో... మన కొత్త సచివాలయం

September 21, 2022


img

తెలంగాణ రాష్ట్ర ప్రజలు గర్వపడే స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం కొత్త సచివాలయం నిర్మిస్తోంది. ఈ దసరా పండుగకి ప్రారంభోత్సవం చేయాలనుకొన్నప్పటికీ నిర్మాణపనులు ఇంకా పూర్తికాకపోవడం వలన మరికొన్ని నెలలు వాయిదా వేసుకోకతప్పడం లేదు. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ నిర్మాణంలో ఉన్న సచివాలయం ఫోటోని ట్విట్టర్‌లో షేర్ చేశారు. దాంతోబాటు సచివాలయం డిజైన్ ఫోటోను కూడా కిందన పోస్ట్ చేశారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న సచివాలయం పూర్తయితే ఆవిదంగా ఉండబోతోందన్న మాట! సచివాలయానికి రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ పేరు ఖరారు చేసిన సంగతి తెలిసిందే. సచివాలయం ఆవరణలో 125 అడుగుల ఎత్తైన అంబేడ్కర్ విగ్రహంతో పాటు అమరవీరుల స్తూపం కూడా నిర్మించబోతున్నారు. నిర్మాణంలో ఉన్న సచివాలయం ఫోటోను చూస్తే 2023 ఫిబ్రవరిలోగా అన్ని పనులు పూర్తయ్యే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది.       Related Post