నితీష్ కుమార్‌ బిజెపితో తెగతెంపులు... ముఖ్యమంత్రి పదవికి రాజీనామా

August 09, 2022


img

బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌ మంగళవారం మధ్యాహ్నం తన పదవికి రాజీనామా చేశారు. ఆయన ఒక్కరే రాజ్ భవన్‌కు వెళ్ళి గవర్నర్‌ ఫగూ చౌహాన్‌ను కలిసి రాజీనామా పత్రాన్ని అందించారు. అంతకు ముందే ఎన్డీయే కూటమిని విడిచిపెడుతున్నట్లు ప్రకటించారు. 

మహారాష్ట్రాలో శివసేన సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చివేసినట్లే కేంద్ర హోంమంత్రి అమిత్ షా తనను గద్దె దించేందుకు చాలా కుట్రలు చేశారని, కానీ తన ప్రభుత్వంలో బిజెపి, ఎన్డీయేలో తమ జేడీయులు భాగస్వాములుగా ఉన్నందున బిజెపి కుట్రలను ఇంతకాలం సహిస్తూవచ్చానని, అవి పరాకాష్టకు చేరుకోవడంతో ఎన్డీయే నుంచి తప్పుకొని, బిజెపిని కూడా వదిలించుకొంటున్నానని నితీష్ కుమార్‌ అన్నారు. 

బిజెపికి దూరం అయినందున బిహార్‌లో ప్రధాన ప్రతిపక్షమైన ఆర్‌జెడీ మద్దతుతో నితీష్ కుమార్‌ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సిద్దం అవుతున్నారు. ఆ పార్టీ అధినేత (లాలూ ప్రసాద్ కుమారుడు) తేజస్వీ యాదవ్‌కు హోంమంత్రి పదవి ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఒకప్పుడు ఆవినీతికి మారుపేరుగా ఉండే లాలూ ప్రసాద్ ప్రభుత్వాన్ని పడగొట్టి నితీష్ కుమార్‌ అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు అదే అవినీతిపరుడి కుమారుడి మద్దతుతో నితీష్ కుమార్‌ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుండటం విశేషం. 


Related Post