బిజెపిలో చేరికపై జయసుధ ఏమన్నారంటే

August 09, 2022


img

సహజ నాటి జయసుధ బిజెపిలో చేరబోతున్నారంటూ సోషల్ మీడియాలో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నెల 21న మునుగోడులో బిజెపి బహిరంగ సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బిజెపిలో చేరబోతున్నారు. జయసుధ కూడా అదే వేదికపై అమిత్ షా సమక్షంలో బిజెపిలో చేరబోతున్నారని సోషల్ మీడియాలో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వాటిపై జయసుధను కలిసి ప్రశ్నించగా “ప్రస్తుతం నేను బిజెపిలో చేరడం లేదు. నాకు ఎన్నికలలో పోటీ చేసే ఓపిక, ఆసక్తి రెండూ లేవు,” అని చెప్పారు. 

కొన్ని రోజుల క్రితమే హుజురాబాద్‌ బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ఆమెను కలిసి పార్టీలోకి ఆహ్వానించగా ఆమె కొన్ని షరతులు పెట్టారని, వాటికి అంగీకరిస్తే బిజెపిలో చేరుతానని చెప్పారని సోషల్ మీడియాలో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అసలు ఆమె బిజెపిలో చేరుతారా లేదా? ఆమె నిజంగానే బిజెపికి షరతులు పెట్టారా?పెడితే అవి ఏమిటి?అనే విషయం త్వరలోనే స్పష్టమవుతుంది.

జయసుధ 2009లో కాంగ్రెస్‌ అభ్యర్ధిగా సికింద్రాబాద్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత జయసుధ కాంగ్రెస్ పార్టీని వీడి 2016లో టిడిపిలో చేరారు. తర్వాత టిడిపికి కూడా గుడ్ బై చెప్పేసి 2019లో వైసీపీలో చేరారు. కానీ అప్పటి నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఒకవేళ ఇప్పుడు బిజెపిలో చేరితే బహుశః ఇదే ఆమె చివరి రాజకీయ మజిలీ అవుతుందని ఆశిద్దాం.


Related Post