కామన్ వెల్త్ గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం

August 08, 2022


img

కామన్ వెల్త్ గేమ్స్‌లో బంగారు పతకం సాధించడమే లక్ష్యంగా దిగిన భారత్‌ బ్యాడ్‌మింటన్ ప్లేయర్ లక్ష్యసేన్ ఈరోజు తన లక్ష్యాన్ని సాధించి భారత్‌కు మరో స్వర్ణం అందించాడు. ఇంగ్లాండ్‌లోని బర్మింగ్‌హామ్‌లో జరుగుతున్న కామన్ వెల్త్ గేమ్స్‌లో లక్ష్య సేన్ సోమవారం మలేషియాకు చెందిన జె యంగ్‌తో ఫైనల్స్ లో తలపడ్డాడు,. తొలి రౌండులో మలేషియా ఆటగాడు జె యంగ్‌ 19-21తో పై చేయి సాధించినప్పటికీ లక్ష్యసేన్ ఏమాత్రం నిబ్బరం కోల్పోకుండా రెండో రౌండులో చాలా ధాటిగా ఆడి 21-9తో గెలుపొందాడు. మూడో రౌండులో కూడా అంతా ధాటిగా ఆడుతూ 21-16తో జె యంగ్‌ని ఓడించి స్వర్ణం సాధించాడు. కొద్ది సేపటి క్రితమే మహిళల సింగిల్స్ లో పీవీ సింధు స్వర్ణం సాధించింది. వెంటనే పురుషుల విభాగంలో లక్ష్య సేన్ కూడా స్వర్ణం సాధించడంతో బర్మింగ్‌హామ్‌లో భారత్‌ శిబిరంలో పండగ వాతావరణం నెలకొంది. 

తాజా పతకాల పట్టిక: స్వర్ణం: 20, రజతం: 15, కాంస్యం: 22. మొత్తం: 57 పతకాలు.           



Related Post