ఈసారి మట్టితోనే ఖైరతాబాద్‌ గణేశ్ విగ్రహం తయారీ

June 27, 2022


img

హైదరాబాద్‌లో వినాయక చవితి సందర్భంగా ఎన్ని గణేశ్ విగ్రహాలు ఏర్పాటు చేసినప్పటికీ ఖైరతాబాద్‌ గణేశ్ విగ్రహం ప్రత్యేకతే వేరు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ ఏడాది పూర్తిగా మట్టితోనే 50 అడుగుల ఎత్తుతో ఖైరతాబాద్‌ గణేశ్ విగ్రహం తయారుచేయనున్నట్లు ఉత్సవ కమిటీ ఈరోజు ప్రకటించింది. ఈ సందర్భంగా ఖైరతాబాద్‌ గణేశ్ విగ్రహం నమూనా చిత్రాన్ని కూడా విడుదల చేసింది. 

ఈసారి మద్యలో పంచముఖ గణపతి, ఎడమ వైపు త్రిశక్తి మహా సరస్వతీదేవి, కుడివైపు షణ్ముక సుబ్రహ్మణ్యస్వామి విగ్రహాలను ఏర్పాటు చేయబోతున్నారు. మట్టితో ఇంతకంటే ఎక్కువ ఎత్తు ఉండే విగ్రహం చేయడం సాధ్యం కాదు కనుక ఈసారి 50 అడుగుల ఎత్తు విగ్రహం తయారుచేయిస్తున్నట్లు ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. 


Related Post