రైతు బంధు నిధుల విడుదలకు సిఎం కేసీఆర్‌ గ్రీన్‌ సిగ్నల్‌

June 23, 2022


img

తెలంగాణలో రైతులకు ఓ శుభవార్త!ఈ నెల 28వ తేదీ నుంచి రైతుల బ్యాంక్ ఖాతాలలో రైతుబంధు సొమ్ము జమా చేయాలని సిఎం కేసీఆర్‌ ఆర్ధిక, వ్యవసాయశాఖల అధికారులను ఆదేశించారు. 

ఇదే విషయం వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలియజేస్తూ “రాష్ట్రంలో అర్హులైన రైతులందరికీ తప్పకుండా రైతుబంధు అందిస్తాం. ఈసారి కూడా ఎప్పటిలాగే ముందుగా ఎకరం భూమి ఉన్న రైతుల బ్యాంక్ ఖాతాలలో రైతుబంధు సొమ్ము జమా చేస్తాము. రెండో రోజున రెండు ఎకరాలు, మూడో రోజున 5 ఎకరాల వరకు భూములున్న రైతుల ఖాతాలలో రైతుబంధు సొమ్ము జమా చేస్తాము. కనుక కాస్త ఆలస్యమైనా ఎవరూ ఆందోళన చెందనవసరం లేదు. ఎవరికైనా రైతుబంధు అందకపోతే కాల్ సెంటరుకి ఫోన్‌ చేసి తెలుసుకోవచ్చు,” అని చెప్పారు.

రైతుబంధు సొమ్ము అందకపోతే రైతులు 90527 033339, 90527 13339, 90527 23339, 90527 43339, 90527 53339 నంబర్లకు ఫోన్‌ చేసి అడిగి తెలుసుకోవచ్చు. ఈ కాల్ సెంటర్‌ ప్రతీరోజు ఉదయం 9.30 నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు పనిచేస్తుంది.  


Related Post