బంగారి తెలంగాణ కాదు అప్పుల తెలంగాణ!

May 14, 2022


img

తెలంగాణ బిజెపి సీనియర్ నేత విజయశాంతి మరోమారు సిఎం కేసీఆర్‌, టిఆర్ఎస్‌ పాలనపై ట్విట్టర్‌లో తీవ్ర విమర్శలు గుప్పించారు. కేసీఆర్‌ బంగారి తెలంగాణ అంటూ ధనిక రాష్ట్రంగా ఉద్భవించిన రాష్ట్రాన్ని అప్పుల తెలంగాణగా మార్చేశారని విమర్శించారు. ఇపుడు ప్రభుత్వం సైతం ఆర్ధిక ఇబ్బందులలో కూరుకుపోయి అప్పుల కోసం తిప్పలు పడుతోంది. కనుక ఈసారి రైతుబంధుకు డబ్బు చెల్లించలేకపోతోందని విజయశాంతి విమర్శించారు. రైతు బంధుకి నిధులు సమకూర్చుకోలేక తిప్పలు పడుతున్న కేసీఆర్‌ సర్కార్ మరోవైపు ఈ పధకంలో సంపన్న లబ్దిదారులకు మేలు చేసేందుకు భూ గరిష్ట పరిమితిని పెంచేందుకు ప్రయత్నిస్తోందని విజయశాంతి ఆరోపించారు. సిఎం కేసీఆర్‌ అనాలోచితంగా ఎడాపెడా అప్పులు చేస్తో రాష్ట్రాన్ని శ్రీలంకలా ముంచేస్తారని విజయశాంతి ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో శ్రీలంకలా మారక మునుపే సిఎం కేసీఆర్‌ను ఫామ్‌హౌస్‌కు సాగనంపాల్సిన అవసరం ఉందని విజయశాంతి అన్నారు.  

 


Related Post