ఇక నుంచి హైదరాబాద్‌ పోలీసులకు మాస్టర్ హెల్త్ చెకప్స్

May 13, 2022


img

రాష్ట్రంలో మిగిలిన జిల్లాలతో పోలిస్తే హైదరాబాద్‌లో పనిచేస్తున్న పోలీసులపై తీవ్ర ఒత్తిడి ఉంటుంది. ఆ కారణంగా వారిలో ఆందోళన, బీపీ, షుగర్, థైరాయిడ్, గుండెపోటు, కిడ్నీ ఫెయిల్యూర్ వంటి అనేక రోగాల బారిన పడుతుంటారు. కనుక ఇకపై హైదరాబాద్‌లో పనిచేస్తున్న పోలీసులు అందరికీ విధిగా ఆరోగ్య పరీక్షలు చేయించాలని నిర్ణయించినట్లు సిటీ పోలీస్ కమీషనర్‌ సీవీ ఆనంద్ తెలిపారు. పోలీసు ఉన్నతాధికారులు తమ ఆరోగ్యంతో పాటు తమ కింద పనిచేస్తున్న సిబ్బంది ఆరోగ్యంపై కూడా శ్రద్ద చూపాలని నగరంలో పోలీస్ ఉన్నతాధికారులకు సూచించారు. నగరంలో పనిచేస్తున్న పోలీసులలో 60 శాతం మంది వివిద ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్నారని, త్వరలోనే వారందరికీ పూర్తి స్థాయిలో ఆరోగ్య పరీక్షలు చేయిస్తామని చెప్పారు. హెల్పింగ్ హ్యాండ్ ఎన్‌జీవో ఈ సేవలు అందించేందుకు ముందుకు వచ్చిందని తెలిపారు. 

ఈ సందర్భంగా సీవీ ఆనంద్ పోలీసులకు ఓ హెచ్చరిక కూడా చేశారు. పోలీస్ శాఖలో ఎవరూ ల్యాండ్ సెటిల్మెంట్ వ్యవహారాలలో తలదూర్చవద్దని గట్టిగా హెచ్చరించారు. నగరంలో గాంబ్లింగ్ అడ్డాలను ఉపేక్షించినట్లు తెలిస్తే వారిపై కటిన చర్యలు తప్పవని సీవీ ఆనంద్ హెచ్చరించారు.


Related Post