ఇండియా గేట్ వద్ద సుభాష్ చంద్రబోస్ విగ్రహం ఏర్పాటు

January 22, 2022


img

స్వాతంత్ర సమర యోధుడు నేతాజీ సుభాష్ చంద్ర బోస్ 125వ జయంతి సందర్భంగా ఢిల్లీలో ఇండియా గేట్ వద్ద ఆయన విగ్రహం ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రధాని నరేంద్రమోడీ ట్విట్టర్‌ ద్వారా దేశ ప్రజలకు తెలియజేశారు. విగ్రహం తయారయ్యే వరకు ఆ స్థానంలో కాంతి కిరణాల ద్వారా ఏర్పడే విగ్రహ రూపాన్ని (హోలోగ్రామ్) ఉంచుతామని తెలిపారు. నేతాజీ సుభాష్ చంద్ర బోస్  జయంతిని పురస్కరించుకొని ఈసారి ఒకరోజు ముందుగా అంటే జనవరి 23వ తేదీ నుంచే గణతంత్ర దినోత్స వేడుకలు ప్రారంభిస్తున్నామని, అదే రోజున నేతాజీ హోలోగ్రామ్‌ (విగ్రహ రూపాన్ని) ఆవిష్కరించబోతున్నట్లు ప్రధాని మోడీ తెలిపారు. నేతాజీ రుణం తీర్చుకొనేందుకు చేసే ఈ చిన్న ప్రయత్నం గురించి ప్రజలకు తెలియజేస్తున్నందుకు చాలా సంతోషిస్తున్నానని ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. 

గతంలో ఇండియా గేట్ వద్ద ఇంగ్లాండ్ కింగ్ జార్జ్-5 విగ్రహం ఉండేది. దానిని 1968లో అక్కడి నుంచి తరలించారు. అదే స్థానంలో గ్రానైట్‌తో చేసిన నేతాజీ సుభాష్ చంద్ర బోనస్‌గా విగ్రహం ఏర్పాటు చేయబోతున్నారు.     



Related Post