మాజీ ముఖ్యమంత్రి కె.రోశయ్య మృతి

December 04, 2021


img

మాజీ ముఖ్యమంత్రి కె.రోశయ్య శనివారం ఉదయం హైదరాబాద్‌లో కనుమూశారు. ఈరోజు ఉదయం ఆయన అస్వస్థతకు లోనవడంతో కుటుంబ సభ్యులు అంబేలెన్సులో బంజారాహిల్స్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలిస్తుండగా దారిలోనే మరణించారు. వైద్యులు ఆయన మరణాన్ని దృవీకరించారు. కుటుంబ సభ్యులు ఆయన మృతదేహాన్ని ఎస్‌ఆర్‌ నగర్‌లోని ఆయన నివాసానికి తరలించారు.   

సమైక్య ఆంధ్ర రాష్ట్రంలో కె.రోశయ్య ముఖ్యమంత్రిగా చేశారు. తరువాత తమిళనాడు గవర్నర్‌గా కూడా చేశారు. ఆ తరువాత వృద్ధాప్య సంబందిత ఆరోగ్య సమస్యల కారణంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. కాంగ్రెస్ అధిష్టానానికి ఎల్లప్పుడూ విధేయుడిగా ఉంటూ చివరి శ్వాస వరకు కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగారు.  Related Post