అఖండకు ఏపీ సర్కార్ చిన్న షాక్

December 03, 2021


img

బోయపాటి శ్రీను, నందమూరి బాలకృష్ణ కాంబినేషన్‌లో  వచ్చిన అఖండ సినిమా నిన్న విడుదలైంది. సాధారణంగా పెద్ద హీరోల అభిమానుల కోసం కొన్ని థియేటర్లలో తెల్లవారుజామున ప్రత్యేకంగా బెనిఫిట్ షోలు వేస్తుంటారు. అయితే ఏపీ ప్రభుత్వం తాజాగా అమలులోకి తెచ్చిన సినీ నియంత్రణ చట్ట ప్రకారం మల్టీ ప్లెక్స్ థియేటర్లలో తప్ప మిగిలిన థియేటర్లలో రోజుకి నాలుగు కంటే ఎక్కువ షోలు వేసేందుకు అనుమతి లేదు. అయితే కృష్ణాజిల్లా మైలవరంలో బాలయ్య బాబు అభిమానుల ఒత్తిడి మేరకు సంఘమిత్ర థియేటర్‌లో నిన్న తెల్లవారుజామున బెనిఫిట్ షో వేశారు. ఈ విషయం తెలుసుకొన్న ఎమ్మార్వో వెంటనే అక్కడకు చేరుకొని షో మద్యలో నిలిపివేసి థియేటర్‌ను సీజ్ చేశారు. దీంతో బాలయ్య అభిమానులు ఆయనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరికి ఆ ఒక్క షోను మాత్రం రద్దు చేసి మిగిలిన నాలుగు షోలు వేసుకొనేందుకు అనుమతించదాంతో బాలయ్య అభిమానులు శాంతించారు.      Related Post