జీవన్ ప్రమాణ్ పత్రాలకు గడువు పొడిగింపు

December 02, 2021


img

కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు ఊరట కలిగించే విషయం ఈరోజు కేంద్రప్రభుత్వం చెప్పింది. వారు పెన్షన్ పొందడానికి జీవన్ ప్రమాణ్ పత్ర్ (లైఫ్ సర్టిఫికేట్) గడువును నవంబర్‌ 31 నుంచి డిసెంబర్‌ 31వరకు పొడిగిస్తున్నట్లు కేంద్రప్రభుత్వం ప్రకటించింది. ఇంతకాలం పెన్షనర్లు కరోనా, లాక్‌డౌన్‌ సమస్యలతో సతమతమైనందున వారి సమస్యలను దృష్టిలో ఉంచుకొని గడువు పొడిగిస్తున్నట్లు కేంద్రం తెలిపింది. కనుక డిసెంబర్‌ 31లోగా పెన్షనర్లు తమ లైఫ్ సర్టిఫికేట్లను తమకు ఖాతా ఉన్న బ్యాంకులు లేదా పోస్టాఫీసులలో సమర్పించాలని సూచించింది. అప్పటి వరకు లైఫ్ సర్టిఫికేట్లను సమర్పించకపోయినా యధాప్రకారం పెన్షన్ పొందవచ్చని కూడా కేంద్రం తెలిపింది. డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్స్ జారీ చేసేందుకు కేంద్రం ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ కలిగిన కేంద్రాలను కూడా ఏర్పాటు చేస్తోంది. అవి అందుబాటులోకి వస్తే పెన్షనర్లకు మరింత సౌకర్యంగా ఉంటుంది. 



Related Post