మరో నాలుగు నెలలు ఉచిత బియ్యం పంపిణీ

November 25, 2021


img

కరోనా విపత్కాలంలో పనులు దొరక్క, ఆదాయం లేక బాధలు పడుతున్న కార్మికులను, నిరుపేదలను ఆదుకొనేందుకు కేంద్రప్రభుత్వం ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన పధకం కింద అర్హులైన ప్రతీ ఒక్కరికీ నెలకు 5 కేజీల చొప్పున బియ్యం లేదా గోధుమలు పంపిణీ చేసింది.దీని ద్వారా దేశంలో 80 కోట్ల మందికి ఆహార భద్రత లభించింది. 

ఈ రోజు ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఈ పధకాన్ని మరో నాలుగు నెలలు అంటే 2022, మార్చి వరకు పొడిగించాలని నిర్ణయించారు. ఈ పధకానికి అయ్యే పూర్తి ఖర్చును కేంద్రప్రభుత్వమే భరిస్తుంది.    Related Post