మెదక్, ఖమ్మం ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో కాంగ్రెస్‌

November 25, 2021


img

వరుస ఓటములతో ఢీలాపడిన కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలలో తన అదృష్టం పరీక్షించుకోవాలని ప్రయత్నిస్తోంది. మెదక్, ఖమ్మం జిల్లాలలో చెరో అభ్యర్ధిని బరిలో దించింది. మెదక్ నుంచి నిర్మలా జగ్గారెడ్డి, ఖమ్మం నుంచి రాయల నాగేశ్వర్ రావు నామినేషన్లు వేశారు. ఈ రెండు స్థానాలలో తాము తప్పక గెలుస్తామని వారు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.

హుజూరాబాద్‌ ఉపఎన్నికలో విజయభేరి మ్రోగించిన బిజెపికి ఈ ఎన్నికలలో పోటీ చేసేందుకు స్థానిక సంస్థలలో తగినంత బలం లేకపోవడంతో పోటీ చేయడం లేదు కానీ స్వతంత్ర అభ్యర్ధులకు మద్దతు ఇస్తోంది. 


Related Post