ఈఎస్ఐ కుంభకోణంలో రూ.144.4 కోట్ల ఆస్తులు జప్తు

November 24, 2021


img

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈఎస్ఐ ఆసుపత్రులకు మందుల కొనుగోలు కుంభకోణంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ (ఈడీ) నిందితులకు చెందిన రూ.144.4 కోట్లు విలువగల ఆస్తులను జప్తు చేసింది. ఈ కుంభకోణంలో ప్రధాన పాత్రధారులైన ఐఎంఎస్ మాజీ డైరెక్టర్ దేవికారాణి, మాజీ జాయింట్ డైరెక్టర్ కలకుంట్ల పద్మ, ఫార్మాసిస్ట్ నాగలక్ష్మి, షెల్ కంపెనీలను సృష్టించిన శ్రీధర్ బాబు, పీ.రాజేశ్వర్ రెడ్డి తదితరులకు చెందిన ఆస్తులను ఈడీ జప్తు చేసింది. 

ఈడీ జప్తు చేసిన ఆస్తులలో హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరు, నోయిడాలోని 97 ఫ్లాట్స్, 6 విల్లాలు, 19 షాపింగ్ కాంప్లెక్స్‌లు ఉన్నాయి. 

2019లో బయటపడిన ఈ కుంభకోణంలో మొత్తం 19 మంది నిందితులు కలిసి రూ.211 కోట్లు ప్రభుత్వ సొమ్మును కాజేసినట్లు ఏసీబీ గుర్తించింది. మొత్తం 8 ఎఫ్ఐఆర్‌లు నమోదు చేసింది. దేవికారాణితో సహా ఆరుగురుని ప్రధాన నిందితులుగా వాటిలో పేర్కొంది. 2019లో దేవికారాణితో సహా ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసింది. తరువాత మరో 19 మందిని ఏసీబీ అరెస్ట్ చేసింది. వారిలో కొందరు బెయిల్‌పై బయటకువచ్చారు.


Related Post