హుజూరాబాద్‌ బరిలో 30 మంది

October 14, 2021


img

హుజూరాబాద్‌ ఉపఎన్నికలో పోటీ చేసేందుకు 61 నామినేషన్లు వేయగా వారిలో నామినేషన్ల పరిశీలన తరువాత 42 మంది మిగిలారు. బుదవారం నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన తరువాత బరిలో 30 మంది మిగిలారు. ముందు జాగ్రత్తగా నామినేషన్ వేసిన ఈటల సతీమణి జమున నిన్న తన నామినేషన్ వెనక్కుతీసుకొన్నారు. 

బరిలో మిగిలినవారిలో టిఆర్ఎస్‌, బిజెపి, కాంగ్రెస్ పార్టీలకు చెందిన గెల్లు శ్రీనివాస్ యాదవ్‌, ఈటల రాజేందర్‌, బల్మూరి వెంకట్‌లతో పాటు ఏడు ఇతర పార్టీల అభ్యర్ధులు, 20 మంది స్వతంత్ర అభ్యర్ధులు ఉన్నారు. రెండు మూడు రోజుల్లో మిగిలిన అభ్యర్ధులందరికీ ఎన్నికల చిహ్నాలు కేటాయిస్తామని తెలిపారు. 

ఈనెల 30న హుజూరాబాద్‌ ఉపఎన్నిక జరుగనుంది. నవంబర్‌ 2వ తేదీన ఓట్లు లెక్కించి ఆదేరోజు ఫలితాలు ప్రకటిస్తారు. Related Post