హుజూరాబాద్‌ బరిలో ఎంతమంది నిలుస్తారో?

October 13, 2021


img

హుజూరాబాద్‌ ఉపఎన్నికలో పోటీ చేసేందుకు 61 నామినేషన్లు వేయగా నామినేషన్ల పరిశీలన తరువాత వారిలో 42 మంది మిగిలారు. వారిలో టిఆర్ఎస్‌, బిజెపి, కాంగ్రెస్ పార్టీలకు చెందిన ముగ్గురు, మిగిలినవారు ఇతర పార్టీలు, స్వతంత్ర అభ్యర్ధులు ఉన్నారు. 

ఒక్కో ఈవీఎంలో నోటాతో కలిపి 16 మంది అభ్యర్ధులను మాత్రమే పొందుపరిచే అవకాశం ఉంటుంది. కనుక ఒకవేళ వారిలో 15-20 మంది పోటీ నుంచి తప్పుకొన్నా మిగిలినవారి కోసం రెండు ఈవీఎంలు ఏర్పాటు చేయవలసి ఉంటుంది. ఒకవేళ అంతకంటే ఎక్కువమంది పోటీలో ఉన్నట్లయితే అప్పుడు మూడు ఈవీఎంలు ఉపయోగించాల్సి వస్తుంది. నామినేషన్ల ఉపసంహరణకు ఈరోజు మధ్యాహ్నం 3 గంటల వరకు గడువు ఉంది. కనుక ఎంతమంది బరిలో మిగిలారో  రేపు తెలియవచ్చు. Related Post