మోడీ-బైడెన్‌ తొలి సమావేశం ఫలప్రదం

September 25, 2021


img

ప్రధాని నరేంద్రమోడీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ తొలిసారిగా శుక్రవారం వైట్‌హౌస్‌లో ముఖాముఖి సమావేశం అయ్యారు. ఇది ఇద్దరు దేశాధినేతల మద్య జరిగే అధికారిక సమావేశమే అయినప్పటికీ ఇద్దరూ మనసువిప్పి మాట్లాడుకోవడంతో సమావేశం ఆద్యంతం చాలా ఆహ్లాదకరంగా సాగింది. 

కోవిడ్, ఆఫ్ఘనిస్తాన్‌లో తాజా పరిస్థితులు, ఉగ్రవాదంపై పోరు, పర్యావరణ పరిరక్షణ, చైనా విసురుతున్న కొత్త సవాళ్ళు తదితర అంశాలపై వారు చర్చించారు. తమ హయాంలో భారత్‌-అమెరికా స్నేహ సంబంధాలు మరింత బలపడతాయని ఇరువురు ఆకాంక్షించారు. ఆర్ధిక, శాస్త్ర, సాంకేతిక, రక్షణ, వాణిజ్య రంగాలలో పరస్పర సహకారం అందించుకోవాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో ప్రధాని నరేంద్రమోడీ భారత్‌లో నివశిస్తున్న జో బైడెన్‌ బందువుల వివరాలను ఆయనకు అందజేశారు. 

మోడీ-బైడెన్ సమావేశంలో భారత్‌ తరపున విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్, జాతీయ భద్రతాసలహాదారు అజిత్ దోభల్, అమెరికాలో భారత్‌ రాయబారి తరణ్ జిత్ సింగ్‌, విదేశాంగ కార్యదర్శి శ్రింగ్లా తదితరులు పాల్గొన్నారు.


Related Post