అప్పు చేసి అప్పు తీర్చుతున్న టీఎస్‌ఆర్టీసీ!

September 18, 2021


img

టీఎస్‌ఆర్టీసీ గురించి చెప్పుకోవాలంటే ముందుగా నష్టాలు, అప్పులు, సమస్యలు, నెలనెలా జీతాల కోసం కార్మికుల ఎదురుచూపులు...వారి కష్టాల గురించే చెప్పుకోవలసిరావడం చాలా బాధాకరమే. టీఎస్‌ఆర్టీసీని గట్టెక్కించేందుకు సాక్షాత్ సిఎం కేసీఆర్‌ స్వయంగా పూనుకొన్నా సాధ్యపడటలేదు. టీఎస్‌ఆర్టీసీకి నెలనెలా గండం అన్నట్లు సాగుతోంది. 

టీఎస్‌ఆర్టీసీని ఆదుకొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం హామీగా ఉంది బ్యాంకుల నుంచి రూ.1,000 కోట్లు అప్పు ఇప్పించింది. దానిలో రూ.500 కోట్లు వివిద అవసరాలకు వాడుకొని త్వరలో అందబోయే మరో రూ.500 కోట్ల రుణంలో రూ.400 కోట్లు టీఎస్‌ఆర్టీసీ కార్మికుల సహకార సంఘం నుంచి వాడుకొన్న సొమ్ము (బాకీ) తిరిగి చెల్లించడానికి వినియోగించాలని నిర్ణయించింది. అంటే ఓ అప్పు చేసి మరో అప్పు తీర్చబోతోందన్న మాట! కానీ ఇప్పుడు బ్యాంకుల నుంచి తెస్తున్న రూ.1,000 కోట్లు అప్పును టీఎస్‌ఆర్టీసీ తిరిగి చెల్లించే పరిస్థితిలో లేదు కనుక దానిని హామీగా ఉన్న ప్రభుత్వమే చెల్లిస్తుందనుకోవాలి. ఒకవేళ ప్రభుత్వం తీర్చకపోతే ఆ భారం టీఎస్‌ఆర్టీసీయే భరించక తప్పదు. వెయ్యి కోట్లలో మిగిలిన వంద కోట్లతో టీఎస్‌ఆర్టీసీ 280 కొత్త బస్సులు కొనుగోలు చేయాలని నిర్ణయించింది. సిఎం కేసీఆర్‌ సూచన మేరకు వాటిని ఆదాయం ఎక్కువగా వచ్చే దూరప్రాంత సర్వీసులకు వాడుకోవాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. టీఎస్‌ఆర్టీసీ నష్టాలు, ఈ కష్టాలు తీరేదెప్పుడో...గాడిన పడేదెప్పుడో?


Related Post