రాజు ఆత్మహత్యపై జ్యుడీషియల్ విచారణకు ఆదేశం

September 17, 2021


img

సైదాబాద్ నిందితుడు రాజు ను పోలీసులే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని, కనుక జ్యూడీషియల్ విచారణ జరిపించి నిజనిజాలు బయటపెట్టాలని కోరుతో పౌరహక్కుల సంఘం అధ్యక్షుడు లక్ష్మణ్ హైకోర్టులో ఓ ప్రజాహిత పిటిషన్‌ వేశారు. దానిపై నేడు విచారణ జరిపిన హైకోర్టు జ్యూడీషియల్ విచారణకు ఆదేశించింది. 

వరంగల్‌ మూడవ మెట్రోపాలిటన్ కోర్టు న్యాయమూర్తికి ఈ బాధ్యత అప్పగించింది. నాలుగు వారాలలోగా దీనిపై విచారణ పూర్తి చేసి సీల్డ్ కవరులో నివేదికను తమకు సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. ఈ కేసులో నిందితుడు రాజు ఆత్మహత్య చేసుకొన్నాడని, అతని మృతదేహానికి పోస్టుమార్టం చేస్తున్నప్పుడు ఏడుగురు సాక్షుల సమక్షంలో వీడియో తీశామని ప్రభుత్వం తరపు హాజరైన ఆడిటర్ జనరల్ ప్రసాద్ తెలుపగా, ఆ వీడియో రికార్డింగ్‌ను రేపు రాత్రి 8 గంటల్లోగా జ్యూడీషియల్ విచారణ జరుపబోతున్న వరంగల్‌ కోర్టుకు అందజేయాలని హైకోర్టు ఆదేశించింది.      



Related Post