రేవంత్‌ రెడ్డి కటౌట్ గొప్పగానే ఉంది కానీ...

September 17, 2021


img

ఈరోజు గజ్వేల్లో కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా సభ జరుగబోతోంది. దీనికి కాంగ్రెస్ పార్టీ భారీగా ఏర్పాట్లు చేసింది. మరికొద్ది సేపటిలో సభ ప్రారంభం కాబోతోంది. ఆనవాయితీ ప్రకారం కాంగ్రెస్ పార్టీ కూడా సభా ప్రాంగణంలో తమ నాయకుల ఫోటోలతో భారీ బ్యానర్లు, కటౌట్లు పెట్టింది. వాటిలో ప్రత్యేకంగా చెప్పుకోవలసింది రేవంత్‌ రెడ్డి కటౌట్. 

తెలుగు సినిమాలో ఓ పౌరాణిక పాత్రలో రేవంత్‌ రెడ్డిని పెట్టి చాలా అద్భుతంగా తయారు చేశారు. నెత్తిన కిరీటం, భుజంపై గద, ఒంటి నిండా బంగారు ఆభరణాలతో రేవంత్‌ రెడ్డి చాలా చూడముచ్చటగా ఉన్నారు. అయితే ఆయన అనుచరులు అత్యుత్సాహంతో పప్పులో కాలేశారు. అది యమదొంగ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ యమధర్మరాజుగా నటించినప్పుడు వేసిన గెటప్. అంటే రేవంత్‌ రెడ్డిని యమధర్మరాజుతో పోల్చారన్న మాట! రేవంత్‌ రెడ్డిని ఏ రాముడు, కృష్ణుడితోనో పోల్చి చూపితే గొప్పగా ఉంటుంది కానీ మనుషుల ప్రాణాలు తీసే యమధర్మరాజుతో పోల్చడమే పొరపాటు. 

అంతేకాదు...రేవంత్‌ రెడ్డికి వ్యక్తిగత ప్రచారయావ చాలా ఎక్కువని, పార్టీ కంటే తన ఇమేజ్ పెంచుకోవడానికే ఆయన ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని, ఆవిదంగానే పార్టీలో ఈ స్థాయికి ఎదిగారని పార్టీలో సీనియర్లు అంటుంటారు. ఇటువంటి కటౌట్లను చూసినప్పుడు వారి వాదనలలో నిజముందని అనిపించకమానదు. కనుక ఇటువంటి వాటితో వారు ఆయనకు ఇంకా దూరం కావచ్చు.


Related Post