నేడు హైదరాబాద్‌లో జాబ్‌మేళా

September 17, 2021


img

శుక్రవారం హైదరాబాద్‌లో జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి తెలిపారు. ఇందులో అపోలో ఫార్మసీ, స్కమార్ బీపిఓ, క్యాష్ కార్డు లిమిటెడ్, జేఎసీ ఆటోమోటివ్, కాలిటర్ వంటి సంస్థలు పాల్గొంటాయని తెలిపారు. ఉదయం 10 నుండి సాయంత్రం 4 గంటల వరకు ఈ జాబ్‌మేళా జరగనుంది. జాబ్ మేళాకు హాజరయ్యే అభ్యర్థులు తప్పనిసరిగా తమవెంట అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్‌లతోపాటు, వాటి జిరాక్స్ కాపీలు, ఆధార్ కార్డు, పాస్ పోర్ట్ సైజు ఫోటోలు తీసుకురావాలని సూచించారు.

అర్హతలు: పదవ తరగతి, ఇంటర్, డిగ్రీ, ఐ టి ఐ, బి ఫార్మసీ

వయోపరిమితి: 18 నుంచి 30 ఏళ్ళలోపు 

వేతనం నెలకు: రూ 10వేల నుంచి 15వేల వరకు.

జాబ్‌మేళా జరుగు స్థలము: మల్లెపల్లి ఉపాధి కార్యాలయం, హైదరాబాద్.

 పూర్తి వివరాలకు సంప్రదించవలసిన మొబైల్ నెంబరు: 82476 56356. 


Related Post