టీఎస్‌ఆర్టీసీ ఛైర్మన్‌గా బాజిరెడ్డి గోవర్ధన్ నియామకం

September 16, 2021


img

నిజామాబాద్‌ రూరల్ నియోజకవర్గం టిఆర్ఎస్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌ టీఎస్‌ఆర్టీసీ ఛైర్మన్‌గా నియమితులయ్యారు. తనకు ఈ అవకాశం కల్పించినందుకు ఆయన సిఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలుపుకున్నారు. హైదరాబాద్‌ పోలీస్ కమీషనర్ వీసీ సజ్జనార్‌ ఇటీవలే టీఎస్‌ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టరుగా నియమితులైన సంగతి తెలిసిందే. 

నష్టాల ఊబిలో కూరుకుపోతున్న టీఎస్‌ఆర్టీసీ ఈవిదంగా రాజకీయ ఉద్యోగకల్పనకు కూడా ఉపయోగపడుతుండటం గొప్ప విషయమే! ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్, వీసీ సజ్జనార్ ఇద్దరూ కలిసి టీఎస్‌ఆర్టీసీని గట్టెకించగలిగితే ఈ పదవులు వారికి సార్ధకమవుతాయి లేకుంటే గతంలో అనేక మందికి రాజకీయ ఉద్యోగాలు కల్పించిన టీఎస్‌ఆర్టీసీ కొత్తగా మరో ఇద్దరికీ కల్పించినదవుతుంది.Related Post