సిఎం కేసీఆర్‌పై వైఎస్ షర్మిల ఆగ్రహం...దీక్ష

September 15, 2021


img

సైదాబాద్ సింగరేణి కాలనీలో ఆరేళ్ళ బాలికపై రాజు అనే ఓ యువకుడు అత్యాచారం, హత్య చేయడంపై వైఎస్సార్‌టిపి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర ఆగ్రహం, అసహనం వ్యక్తం చేశారు. ఈరోజు ఆమె బాధిత కుటుంబాన్ని పరామర్శించి అక్కడే దీక్షకు కూర్చొన్నారు. ఈ ఘటనపై సిఎం కేసీఆర్‌ స్పందించేవరకు అక్కడే దీక్ష కొనసాగిస్తానని వైఎస్ షర్మిల తెలిపారు. రాష్ట్రంలో ప్రజలకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. రాష్ట్రంలో చిన్న పిల్లలకు కూడా భద్రత కరువైందని వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన జరిగి మూడు రోజులవుతున్నా ఇంతవరకు పోలీసులు నిందితుడిని పట్టుకోలేకపోయారని వైఎస్ షర్మిల అసహనం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం పది కోట్లు నష్టపరిహారం ఇవ్వాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. 

నగరమంతా పోలీసులు, సీసీ కెమెరాల నిఘా ఉన్నప్పటికీ ఇటువంటి ఘటనలు ఎప్పుడు ఎక్కడ జరుగుతాయో ఎవరికీ తెలియదు. కనుక దీనికి పోలీసులను, ప్రభుత్వాన్ని నిందించడం సరికాదు. ఈ ఘటన జరిగినప్పటి చి పోలీసు నుంచి బృందాలు నిందితుడి కోసం గాలిస్తూనే ఉన్నాయి. కనుక నేడో రేపో అతనిని పట్టుకోవడం ఖాయమే. కానీ ఇంతలోనే పోలీసులు వైఫల్యం చెందారంటూ వైఎస్ షర్మిల విమర్శించడం తగదు. ఈ ఘటనపై సిఎం కేసీఆర్‌ స్పందించి ఉంటే బాగుండేది. కానీ స్పందించనంతమాత్రన్న ఆయన దీనిని పట్టించుకోలేదని అనుకోవడం కూడా పొరపాటే. ఇటువంటి విషయాలలో ఓ ముఖ్యమంత్రిగా ఆయన ఏమి చేయాలో అదే చేస్తారు. కనుక వైఎస్ షర్మిల దీక్ష విరమించడం మంచిది లేకుంటే ఆమె ప్రజల దృష్టిలో పలుచనవుతారు. 


Related Post