ఉద్యోగాల భర్తీపై సిఎం కేసీఆర్‌ తుది నిర్ణయం?

September 15, 2021


img

రాష్ట్రంలో వివిద ప్రభుత్వ శాఖలలో 50,000 ఉద్యోగాలను భర్తీ చేస్తామై సిఎం కేసీఆర్‌ గత ఏడాది డిసెంబర్‌ 13న ప్రకటించారు. అప్పటి నుంచి ఆ ఉద్యోగాల నోటిఫికేషన్ల కోసం నిరుద్యోగులు కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. కానీ ఎప్పటికప్పుడు ఏదో హడావుడి చేస్తుండటమే తప్ప ఇంతవరకు నోటిఫికేషన్లు వెలువడలేదు. సిఎం కేసీఆర్‌ గురువారం మధ్యాహ్నం 2 గంటలకు ఉన్నతాధికారులతో ప్రగతి భవన్‌లో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో ఉద్యోగాల నోటిఫికేషన్లపై తుది నిర్ణయం తీసుకోవచ్చునని సమాచారం. 

మొదట అన్ని శాఖలలో కలిపి 50 వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయని అధికారులు అంచనా వేసినప్పటికీ, సిఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు మళ్ళీ పరిశీలించగా సుమారు 65 వేలు ఖాళీలు ఉన్నట్లు గుర్తించారు. రేపు జరుగబోయే సమావేశంలో సిఎం కేసీఆర్‌ ఆమోదం తెలిపితే ఈ నెలాఖరులోగా నోటిఫికేషన్ల జారీ మొదలయ్యే అవకాశం ఉంది.         Related Post